గోదావ‌రి తీర ప్రాంత గ్రామస్తుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లింపు..

గ‌త రెండు మూడు రోజులు గా ఏడ‌తెరిపి లేకుండా కురుస్తున్న

Update: 2024-09-01 11:56 GMT

దిశ‌,ఏటూరునాగారం : గ‌త రెండు మూడు రోజులు గా ఏడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కారణంగా జిల్లా అధికారులు అప్ర‌మ‌త్తామ‌య్యారు.కాగా ములుగు జిల్లా వ్యాప్తంగా ప‌లు గ్రామ‌ల‌లోని గోదావ‌రి, ఉప్పోంగుతున్న వాగు తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ మేర‌కు శనివారం రోజు నుండి ఏడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షం కార‌ణంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం బుటారం వాగు ఉప్పోంగుతూ క్ర‌మ‌క్ర‌మంగా వ‌ర‌ద ఉదృతి పెరుగుతుండ‌డంతో బుటారం గ్రామానికి చెందిన 230 మంది గ్రామాస్తుల‌ను మండ‌ల కేంద్రంలోని గిరిజ‌న భ‌వ‌న్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల‌కు అదివారం రోజున‌ ముంద‌స్తు చ‌ర్యల్లో భాగంగా అధికారులు త‌ర‌లించారు.


Similar News