రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పోలీసుల గౌరవ వందనం..
వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన ముగించుకుని
దిశ, హన్మకొండ : వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన ముగించుకుని జనగామ జిల్లా పర్యటనకు వెళ్తుండగా వరంగల్ ఎన్ఐటీ అతిథి గృహం వద్ద రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, తదితరులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జనగామ జిల్లా పర్యటనకు వెళుతున్న క్రమంలో పోలీసులు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల గౌరవ వందన సమర్పణ అనంతరం బయలుదేరిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె.నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.