రైతు పండుగను విజయవంతం చేయండి : హనుమాన్ల తిరుపతిరెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల కట్టుబడి,

Update: 2024-11-29 11:28 GMT

దిశ, తొర్రూరు:- మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల కట్టుబడి, రైతులకు మద్దతుగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో రైతు పండుగ నిర్వహించడం జరుగుతుందని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ రైతు పండుగ కార్యక్రమం విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని తిరుపతి రెడ్డి అన్నారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యులు రైతులకు అవగాహన కల్పించి ఈ రైతు పండుగను విజయవంతం చేయడానికి సహకరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం నూతన చర్యలను ప్రవేశపెడుతూ, వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ రైతు పండుగ నిర్వహణ జరుగుతోందని తెలిపారు. కావున రైతులందరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవ్వాలని, 29, 30 తేదీల్లో అధిక సంఖ్యలో హాజరై ఈ పండుగను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చి రెడ్డి, వెంకట చారి, గోపాల్, సంధ్యారాణి, మల్లేశం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News