పశువుల్లో పంజా విసురుతున్న లంపీ స్కిన్

గిరిజన గ్రామంలో మూగజీవాలకు పెద్దకష్టం వచ్చి పడింది.

Update: 2024-08-27 11:04 GMT

దిశ,డోర్నకల్: గిరిజన గ్రామంలో మూగజీవాలకు పెద్దకష్టం వచ్చి పడింది.లంపీ స్కిన్‌ అనే పిలిచే ముద్దచర్మ వ్యాధితో మూగజీవాలకు నరకయాతన అనుభవిస్తున్నాయి.మరణాలు సంభవించాయి.రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది.మండల పరిధిలో హున్య తండా గ్రామంలో పశువులకు లంపీ చర్మ వ్యాధి తీవ్రంగా ఉంది.మొదట్లో ఒకటి రెండు దద్దుర్లతో మొదలై.. క్రమంగా అవి పెరిగి పెద్దగా శరీరమంతా విస్తరిస్తున్నాయి.పుండ్లు గా మారి, వాటి ప్రాణాల మీదకు వస్తోందని గిరిజన రైతులు వివరిస్తున్నారు.గ్రామంలో దాదాపు 20 పశువులు చనిపోయినట్లు చెబుతున్నారు.వేల రూపాయలు ఖర్చుపెట్టిన ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యాధి విస్తరిస్తున్న, పశు వైద్యులు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు.సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News