కోటి రూపాయల భూ అక్రమ దందా..పలు సార్లు పత్రికలో ప్రచురించిన పట్టింపేది..?
డీపీఎం 59 కెనాల్ కాల్వ దారిని అక్రమంగా ఆక్రమించి కాలువ
దిశ, తొర్రూరు: డీపీఎం 59 కెనాల్ కాల్వ దారిని అక్రమంగా ఆక్రమించి కాలువ పై అక్రమ కట్టడాలు నిర్మించి వ్యవసాయ భూములకు రైతులను పోనివ్వకుండా కెనాల్ కాలువ బాటను ప్రొక్లెన్ తో బాటను తవ్వి కబ్జాకు గురి చేస్తున్నాడని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ఏమి తెలియనట్లు చోద్యం చూస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు మండలం,వెలికట్ట గ్రామ శివారులోని,పీఎస్ఆర్ పాఠశాల యాజమాన్యం కెనాల్ కాలువ బాటను సుమారుగా 8 గుంటలు బాటను కబ్జా చేసి కాలువపై అక్రమ కట్టడాలు నిర్మించారని,అధికారులు తేల్చి చెప్పిన దానిని తొలగించే నాథుడే లేరు.కానీ ఇప్పుడు ఆ బాట విలువ సుమారుగా కోటి రూపాయలు,ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.కెనాల్ కాలువపై అక్రమ నిర్మాణాలు,చేపట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, అటువైపుగా రైతులను ఎవరినీ వెళ్లనీయకుండా గేట్లు సైతం ఏర్పాటు చేశారని రైతులు వాపోతున్నారు.
పీఎస్ఆర్ స్కూల్ నిర్లక్ష్యం..
పీఎస్ఆర్ పాఠశాల ముందు నుంచి వెళుతున్న డీపీఎం 59 కెనాల్ కాలువలో నీళ్ళు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు దాంట్లో విద్యార్థులు పడిపోతారని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గతంలో అనేకమార్లు జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, కలెక్టర్ కు విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. డీపీఎం 59 కెనాల్ కాలువ కబ్జాకు గురైందని, దానిని కాపాడాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.ఎన్ని బెదిరింపులు, ఒత్తిడిలు వచ్చినా వెనక్కి తగ్గని విద్యార్థి సంఘాల నాయకులు న్యాయం కోసం అధికారుల చుట్టూ రైతులు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు.
అధికారులతో కుమ్మక్కు..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పీ ఎస్ ఆర్ పాఠశాల యాజమాన్యం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అత్యంత సన్నిహితుడిగా, అనుచరుడిగా చలామణి కావడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేశారు. అదేవిధంగా పీ ఎస్ ఆర్ స్కూల్ యాజమాన్యం అధికారులతో కుమ్మకు కావడంతో ఆ పీఎస్ఆర్ స్కూల్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇరిగేషన్ శాఖ అధికారులు రెవెన్యూ శాఖకు డీబీఎం 59 కెనాల్ కాలువ సర్వే చేయాలని గతంలో దరఖాస్తు పెట్టుకుంటే గిర్ధవర్, సర్వేయర్, జీఎఆర్ఐ కలిసి సర్వే నిర్వహించారు. సర్వే నివేదిక ప్రకారం ఎనిమిది గుంటల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం మైందని, కెనాల్ పై పీఎస్ఆర్ పాఠశాల యాజమాన్యం పెన్సింగ్ అక్రమంగా నిర్మాణం చేపట్టిందని రిపోర్టులో తేలింది. ప్రభుత్వ కెనాల్ భూమి ఉండాల్సిన హద్దులు దాటి కాలువపై నిర్మాణాలు చేపట్టారని గతంలో తేల్చిన.. అయినా కూడా ఎన్ని రోజులు గడుస్తున్న పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్,సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతుల వ్యవసాయ భూములకు వెళ్లే విధంగా బాటను మరియు అక్రమ కట్టడాలను వెంటనే తీసివేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న కలెక్టర్..
తొర్రూరు మండలం డీపీఎం59 కెనాల్ కాల్వపై అక్రమ కట్టడం నిజమే,అని రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పిన జిల్లా కలెక్టర్ మాత్రం అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని స్థానిక రైతులు ఆశ్చర్యపోతున్నారు.గతంలో పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం కోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకువచ్చాక,న్యాయస్థానం,పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ కు అప్పజెప్పడంతో,సంవత్సరాలు గడుస్తున్నా కలెక్టర్ మాత్రం ఆ అక్రమ కట్టడంపై పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.పలు సార్లు స్థానిక ఎమ్మార్వో నివేదిక పంపిన కలెక్టర్ పట్టింపు లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డిపిఎం 59 కెనాల్ కాలువ పై అక్రమ కట్టడం మరియు ఆక్రమించిన కెనాల్ బాటను వెంటనే రైతులకు ఉపయోగించే విధంగా చేయాలని రైతులు కోరుతున్నారు.
ఎనమిది గుంటలు అక్రమం : వినోద్ కుమార్, ఎమ్మార్వో తొర్రూరు
కెనాల్ కాల్వ పై పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం అక్రమ కట్టడం నిర్మించడం నిజమేనని మేము కలెక్టర్ కు నివేదిక పంపించాము. స్కూల్ చుట్టూ అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ వేశారు,దానిని కూడా మేమే జెసిబి పెట్టి కూల్చడం జరిగింది. అంతలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు అన్యాయంగా మా ఫెన్సింగ్ను కూల్చివేసారని కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు ద్వారా కలెక్టర్ కు ఆదేశాలు వచ్చాయి.మేము సర్వే చేసి ఎనమిది గుంటలు అక్రమంగా కబ్జా చేసుకొని దాని పై అక్రమ కట్టడాలు నిర్మించారని కలెక్టర్ కు వివరాలు అందించాము.కానీ చాలా సార్లు కలెక్టర్ సమయం లేక ఇన్ని రోజులు ఆగవలసి వచ్చింది.దీనిపై పూర్తి జడ్జిమెంట్ కలెక్టర్ కు న్యాయస్థానం అప్పగించారు. 31 ఆగస్టు కు వాయిదా వేశారు.