జడివానతో ప్రయాణికుల్లో అలజడి.. ఆగిన రైళ్లు.. ఆందోళనలో ప్యాసింజర్‌లు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్

Update: 2024-09-01 12:02 GMT

దిశ,డోర్నకల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వరుణుడి ఉగ్రరూపానికి విలవిల్లాడింది. వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో తాళ్ల పూస పల్లి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైల్వే అధికారులు మానుకోట మీదుగా వెళ్లే రైళ్లను నిలిపివేశారు. అర్ధరాత్రి ముందే విజయవాడ నుంచి బయలుదేరిన పలు రైలు డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేశారు. హోరు వాన, రైల్వే స్టేషన్లతో నిలిచిన రైళ్లు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన.. వర్షంలో కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి. దీంతో మానుకోట పోలీస్ శాఖ స్పందించి దాతల సహకారంతో ఆయా రైళ్లలోని ప్రయాణికులకు భోజనం అందించారు. అదే విధంగా డోర్నకల్ జంక్షన్ లోనూ గంటల కొద్ది రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు లోనయ్యారు. మార్గమధ్యంలో రైలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు గమ్యం చేరుటకు ఎంత సమయం పడుతుందో అని భయపడుతూ.. బాధపడుతూ దిక్కుతోచక బిక్కుబిక్కుమన్నారు.

ఎటు చూసినా జోరున వాన.. చేతిలో చంటి పిల్లలు ఉన్న తల్లులు.. స్టేషన్లో బ్రష్ చేసుకుంటూ.. అమ్మ మనం ఎప్పటికీ ఇంటికి పోతాం.. ఆకలి వేస్తుంది.టిఫిన్ కావాలని..ట్రైన్ లో ఇస్తారా.. అంటూ గద్వత స్వరంతో తల్లితో అడుగుతున్నారు.ఆహారం కోసం ప్లాట్ఫారాలపై అటు,ఇటు పరుగులు పెట్టారు. ప్రయాణికుల అవస్థలు గమనించిన స్థానికులు మహబూబాబాద్,డోర్నకల్ రైల్వే స్టేషన్ లో బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు, బ్రేక్ ఫాస్ట్, మంచినీరు, భోజనం అందజేశారు. చిన్నపిల్లలతో ఉన్న వారికి ప్రత్యేక అల్పాహారాన్ని అందజేశారు. ఆకలి తీర్చిన అధికారులను,పురపాలక ఆరవ వార్డు కౌన్సిలర్ తేజావత్ సంధ్య రమేష్, జర్నలిస్ట్ రాజేందర్ సింగ్ సతీమణి టీచర్ కలపాల అనిత కూతురు ఠాగూర్ సంజన రాజ్, పట్టణ నాయకులు మాదా శ్రీనివాస్, సుశీల్ జైన్, తాళ్లూరి హనుమ, దేశ బోయిన శ్రీనివాస్, గాజుల వేణు, ఫరీద్,రహీం,యశోదర్,రెడ్డబోయిన శంకర్,ఖాదర్ తదితరులను ప్రజలు అభినందించారు.

పలు రైళ్ల దారి మళ్లింపు..

మోటమర్రి నుంచి వయా నల్గొండ మీదుగా సికింద్రాబాద్ పంపించారు. డోర్నకల్ జంక్షన్ లో గౌతమి,చార్మినార్, పద్మావతి, సింహపురి,ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నిలిచాయి. కాకతీయ సూపర్ ఫాస్ట్, సింగరేణి ఉదయం వెళ్లగా, మహబూబాబాద్ లో సిగ్నల్ క్రాసింగ్ కోసం గంట పాటు ఆపారు. డోర్నకల్ మీదుగా వెళ్లే విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ, గుంటూరు-సికింద్రాబాద్ పలు రైళ్లను రద్దయ్యాయి. విశాఖపట్నం- నాందేడ్, విశాఖపట్నం-సికింద్రాబాద్, తంబరం- హైదరాబాద్,ధనపూర్-బెంగళూరు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించింది. వివిధ స్టేషన్ లో నిలిచిన రైళ్లను వెనక్కి మళ్లించి మోటమర్రి వయా నల్గొండ మీదుగా సికింద్రాబాద్ పంపించారు.


Similar News