బోనాల వేళ విషాదం..విద్యుత్ షార్ట్ షర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం
శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో ఊరంతా
దిశ, మంగపేట : శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో ఊరంతా గ్రామ దేవతకు బోనాలు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. మండలంలోని కొత్త మల్లూరుకు చెందిన రెబ్బల రాములు, రమ దంపతుల ఇళ్లు ఆదివారం కరెంట్ షార్ట్ షర్క్యూట్ కు పూర్తిగా దగ్ధమై ఇంట్లోని లక్ష రూపాయలకు పైగా నగదు విలువైన సామాగ్రి క్షణాల్లో ఖాళీ బూడిదయ్యాయి. ఊరంతా బోనాల చేసుకుండుంగా రమ కూడా బోనమెత్తుకుని మహిళలతో కలిసి గ్రామ దేవత దగ్గరకు వెల్లగా భర్త రాములు మోటారు చైన్ బ్లాక్ పనుల కోసం వెళ్లినట్లు తెలిపింది. బోనాల సంబురంలో ఉండగా అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఇంటిని అగ్ని ప్రమాదాన్ని ఆర్పలేకపోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాదితులు రాములు రమ తెలిపారు. ఇంట్లోని విలువైన బంగారం, వెండి వస్తువులు దుస్తులు వంట సామాగ్రి పూర్తిగా దగ్ధం కాగా ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.