ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు… భక్తులతో కిక్కిరిసిన కాళేశ్వరం
కార్తీక మాసంలో పర్వదినమైన పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
దిశ, కాటారం : కార్తీక మాసంలో పర్వదినమైన పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి త్రివేణి సంగమ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రామాల్లో ప్రజలు వేకువ జామున లేచి గృహాలలో పూజలు చేసి అనంతరం దేవాలయాలు ఉసిరిక చెట్టు కింద వత్తులు ఉసిరిక, దీపాలు వెలిగించి మొక్కుబడులు సమర్పించారు. కాలేశ్వరం దేవాలయంలో వివిధ ఆకుపతులలో దీపాలను వెలిగించి దీపోత్సవం నిర్వహించారు. పంచరత్నాలలో చివరి రోజు శుక్రవారం పర్వదినం కావడం భక్తులు అధిక సంఖ్యలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలు గ్రామాలలో బ్రాహ్మణోత్తములకు దీప దానం చేశారు. శుక్రవారం సాయంత్రం గోదావరి నదికి మంగళ హారతి ఇచ్చారు.
దేవాలయాల్లో కాళేశ్వరం ధన్వాడ గారి పెళ్లి అయ్యప్ప దేవాలయంలో ఆకాశ దీపాలు వెలిగించారు. అనంతరం ధన్వాడ దత్తాత్రేయ దేవాలయం, కాళేశ్వరం లో ముక్తేశ్వర స్వామి దేవాలయంలో జ్వాలాతోరణం నిర్వహించారు. కాళేశ్వరం దేవాలయం లో జ్వాలా తోరణం వెలిగించి అందునుండి ఉత్సవ దేవతా మూర్తులతో పాటు భక్తులందరూ జ్వాలా తోరణం నుండి దూరి దర్శనం చేసుకున్నారు. భక్తులు సుమారుగా 60 వేల మంది వచ్చినట్లు అంచనా, వివిధ టికెట్లపై, ప్రసాదాలపై ఆదాయం సుమారుగా రూ. 9 లక్షలు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామాలలో భక్తులు టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించుకున్నారు. పురాతన ఆనవాయితీగా వస్తున్న ప్రధాన ఆచరణ కార్తీక పౌర్ణమి రోజున గ్రామీణ ప్రజలు గృహాల ముందు రోకలిని పెట్టి పైన మట్టి ప్రమిదలో దీపం వెలిగించారు.