మిర్చి కొనుగోళ్ల తూకంలో మోసాలు..

Update: 2023-05-15 08:19 GMT

దిశ, మహబూబాబాద్ రూరల్: మిర్చి కొనుగోళ్ల తూకంలో మోసాలు రైతుల పాలిట శాపంగా మారాయి. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన రైతులను చిల్లర కాంట వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మెషిన్లను పెట్టుకుని వందల కిలోల బస్తాకు మిర్చికి 90 కిలోలు లెక్కచూపుతున్నారు. 50 కిలోల మిర్చి బస్తాకు 45 కిలోలు వచ్చేలా ఎలక్ట్రానిక్ మిషన్‌లను సెట్ చేస్తున్నారు.

తూకాల్లో తక్కువ వచ్చే ఎలక్ట్రానిక్ మిషన్లను సెట్ చేస్తూ అమ్మకులైన గిరిజన రైతులను మోసాలకుగురి చేస్తూ లక్షలాది రూపాయలు చిల్లర కంటవ్యాపారులు సంపాదిస్తున్నారు. చిల్లరకాండ వ్యాపారులు వీరికి తూనీకల కొలతల శాఖ లైసెన్సు ఉండదు. లేబర్ కార్యాలయం నుండి లైసెన్స్ ఉండదు. కమర్షియల్ ట్యాక్స్ నుండి అనుమతి పత్రం ఉండదు. వాణిజ్య వ్యాపార లైసెన్స్ ఉండదు. అంత జీరో దందా చేస్తూ లక్షలాది రూపాయలు చిల్లర కాంట వ్యాపారులు సంపాదిస్తూ నిట్ట నిలువునా రైతులను చిల్లరగా బస్తాల్లో ఎండుమిర్చిని విక్రయించి రైతుల నడ్డి విరుస్తున్నారు.

చిల్లరకాండ వ్యాపారులపై తునికల కొలతల శాఖ వారి నిఘ, లేబర్ కార్యాలయం నిఘా, వాణిజ్య పనుల శాఖ నిఘ లేకపోవడం తమ ఇష్టానుసారం రైతులను చిల్లరకాండ వ్యాపారులు మోసం చేస్తున్నారు .దీని అంతటికి ప్రతినెల నెల లంచాలు ఇస్తున్నట్లుగా చిల్లర కాంట్రా వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు చిల్లరకాండ వ్యాపారులపై కఠినమైన చీరలు తీసుకొని రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.

చిల్లర కాంట వ్యాపారుల అడ్డాలు ఇవే..


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సంపేట రోడ్‌లో 8 దుకాణాలు, కేసముద్రం పూసపల్లి రోడ్డులో 8 దుకాణాలు, తొర్రూర్ రోడ్‌లోని మూడు కోట్లు సెంటర్ లో 5 దుకాణాలు, కొరివి మండలంలోని ఖాన్ పెళ్లి రోడ్డు ఏరియాలో 3 దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో చిల్లర కాంటాల తూకాలకి రైతులు మోసపోతున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులకు కోరుతున్నారు.

Tags:    

Similar News