భోజనం నాణ్యత పెంచాలి
భోజనం నాణ్యత పెంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు.
దిశ, నర్సంపేట : భోజనం నాణ్యత పెంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. నర్సంపేటలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా భోదనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫుడ్ విషయంలో నాణ్యతను పెంచాలని సూచించారు.
అలాగే నర్సంపేట మండలంలోని బానోజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నితనిఖీ చేశారు. ఈ క్రమంలో బానోజిపేటలో నిర్వహించిన మెడికల్ క్యాంప్ ని పరిశీలించారు. అక్కడికి వచ్చిన రోగులతో ముచ్చటించారు. వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.