అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు ప్రారంభం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సంవత్సరం అలాగే పీజీ మొదటి సంవత్సరం కొరకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు హనుమకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల , యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ డా.రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-01-13 10:23 GMT

దిశ, కేయూ క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సంవత్సరం అలాగే పీజీ మొదటి సంవత్సరం కొరకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు హనుమకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల , యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ డా.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఈనెల 31 వరకు అవకాశం ఉందని, అడ్మిషన్ల కొరకు ఏదైనా టీఎస్ ఆన్లైన్ లేదా మీసేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, వెరిఫికేషన్ కొరకు ఏ అధ్యయన కేంద్రంలో అడ్మిషన్ తీసుకుంటారో ఆ అధ్యయన కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు.

అలాగే ఏదైనా మీ సేవ కేంద్రాలలో.. టీఎస్ ఆన్లైన్ సెంటర్లలో ఫీజు చెల్లించి రసీదులు పొందాలన్నారు. దరఖాస్తు ఫారం అధ్యయన కేంద్రంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాల కొరకు యూనివర్సిటీ వెబ్సైట్ను www.braouonline.com సందర్శించాలని లేదా కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హనుమకొండ, సీకేఎం డిగ్రీ కాలేజీ వరంగల్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూర్, భూపాలపల్లి, ములుగు జనగాం మరియు ఏటూర్ నాగారం జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలను సందర్శించవచ్చని సూచించారు.

17, వరకు డిగ్రీ పరీక్ష ఫీజుకు గడువు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి డిగ్రీ రెండో సంవత్సరం, మూడో సెమిస్టర్ అలాగే డిగ్రీ మూడో సంవత్సరం వారి ఐదవ సెమిస్టర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుటకు ఈనెల 17 ఆఖరి తేదీ. 500 అపరాధ రుసుముతో 23వ తారీకు ఉన్నట్టు పేర్కొన్నారు. పరీక్ష ఫీజును ఏదేని టీఎస్ ఆన్లైన్ సెంటర్ లేదా మీసేవ కేంద్రాల్లో కానీ చెల్లించి రసీదును పొందాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు.

అందుబాటులో పీజీ రెండు స్పెల్‌ల పరీక్షల హాల్ టికెట్లు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో బిఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి మరియు పీజీ విద్యార్థులకు సంబంధించిన స్పెల్- 2 పరీక్షలు ఈనెల 17 నుంచి జరిగే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయని, పరీక్షల హాల్ టికెట్లు కొరకు యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ బీఆర్ఎఓయూ. ఆన్లైన్.ఇన్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

31వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం అలాగే పీజీ రెండవ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించుటకు గడువు తేదీని పొడగించినట్లు వారు పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందని ఫీజులు చెల్లించని వారు ఆన్లైన్ సెంటర్లో/మీ-సేవా కేంద్రాల్లో ఫీజులు చెల్లించి రసీదును పొందాలని సూచించారు.


Similar News