క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలించి నివేదిక అందించాలి : మంత్రి సీతక్క

గురువారం సాయంత్రం సమయంలో ములుగు జిల్లాలోని

Update: 2025-04-04 05:36 GMT
క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలించి నివేదిక అందించాలి : మంత్రి సీతక్క
  • whatsapp icon

దిశ, ములుగు ప్రతినిధి: గురువారం సాయంత్రం సమయంలో ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడువాయి మండలంలో భారీ వర్షాలు కురిసాయి. గోవిందరావుపేట, తాడువాయి మండలాల్లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడం తో పంట పొలాల్లో ఉన్న రైతుల పంటలు గాలివానకు నేలకొరిగాయి. గోవిందరావుపేట మండలం లో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురవడంతో వరి,మిర్చి,మొక్కజొన్న పంటలు నేలకొరిగి పంట నష్టం చోటు చేసుకుంది. బలమైన ఈదురుగాళ్ల మూలాన విద్యుత్ స్తంభాలు తిరగడంతో మండలంలోని కొన్ని గ్రామాల్లో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం ములుగు జిల్లాలోని మంగపేట మండలం లో అత్యధికంగా 31.4 ఢిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవగా, గోవిందరావుపేట మండలం లో 28.8 మిల్లీమీటర్ల, తాడ్వాయి మండలంలో 14 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి సీతక్క..

ములుగు జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. గురువారం రాత్రి అకాల వర్షాలకు పంట నష్ట పోయిన విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క శుక్రవారం ఉదయాన్నే గోవిందరావుపేట మండలంలోని చంద్రు తండా, కర్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించి వర్షాల మూలాన పంట నష్టపోయిన పంటలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను కోరారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.



 

Similar News