బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ త‌క్క‌ళ్ల‌ప‌ల్లిపై పీఎస్‌లో ఫిర్యాదు

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ త‌క్క‌ళ్ల‌ప‌ల్లి

Update: 2024-08-26 15:29 GMT

దిశ‌, మ‌హ‌బూబాబాద్ టౌన్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్‌రావు అస‌భ్య ప‌ద‌జాలంతో చేసిన వ్యాఖ్య‌లు హేయ‌నీయమ‌ని మ‌హ‌బూబాబాద్ టౌన్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఘ‌న‌పుర‌పు అంజ‌య్య విమ‌ర్శించారు.సీఎం రేవంత్ రెడ్డిపై ర‌వీంద‌ర్‌రావు చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఎమ్మెల్సీపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ సోమ‌వారం మ‌హ‌బూబాబాద్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

మరోసారి ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్య‌లే చేస్తే తాము ఊరుకునేది లేద‌ని, తాము చేయాల్సింది చేసి చూపిస్తామంటూ హెచ్చ‌రించారు.ప్రభుత్వం పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదని అక్కసుతో ఇలాంటి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడిన భాష సంస్కారహీనంగా ఉంద‌ని అంజ‌య్య మండిప‌డ్డారు. టీడీపీ నుంచి ఆయనను బహిష్కరిస్తే.. బీఆర్ఎస్‌లో చేరారని, కార్యకర్తలకు ఏనాడూ న్యాయం చేయలేదన్నారు.


Similar News