భూమి వివాదంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్షణ‌..

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురంలో మంగళవారం భూమి కోసం ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Update: 2023-04-04 11:41 GMT
భూమి వివాదంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్షణ‌..
  • whatsapp icon

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురంలో మంగళవారం భూమి కోసం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తరిగొప్పుల మండల సోలిపురం శివారులో భూవివాదంలో ఘర్షణ చెలరేగిందని స్థానికులు తెలిపారు. గొల్ల కురుమలకు సంబంధించిన భూమిపై అధికార పార్టీ నాయకులు ఫెన్సింగ్ నాటుతుండగా గొల్ల కురుమలు అడ్డుకున్నారు. పరస్పరం రాళ్లు, కర్రలతో ఇరువర్గాలు దాడికి దిగడంతో, దాడిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు వివరించారు. అధికార పార్టీకి సంబంధించిన తరిగొప్పుల జడ్పీటీసీ పద్మజ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తమపై దౌర్జన్యం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News