‘బీసీ రిజర్వేషన్ల బిక్ష బీపీ.మండల్ చలువే’..

కాకతీయ యూనివర్సిటీ, మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రాంగణములో బీపీ

Update: 2024-08-25 09:15 GMT

దిశ, హనుమకొండ టౌన్ : కాకతీయ యూనివర్సిటీ, మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రాంగణములో బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా సంగని మల్లేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఓబీసీలు విద్యా ఉద్యోగ రంగాల్లో అనుభవిస్తున్న రిజర్వేషన్లు నాడు బీపీ మండల్ చైర్మన్ గా ఉన్నప్పటివేనని కొనియాడారు. ఓబీసీల జనగణన చేయకుండా జాప్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్ జిల్లా అధ్యక్షులు డా తాడురి శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి డా నల్లాని శ్రీనివాస్, జిల్లా నాయకులు డాక్టర్ పెద్ద బోయిన వెంకటయ్య, డా వంగాల సుధాకర్, కంజర్ల నరసింహ రాములు, మోటే చిరంజీవి, డా శంకర్, సురేందర్, నీలం ప్రనూప్, తదితరులు పాల్గొన్నారు.


Similar News