జీఓ 28 ప్రతులు దహనం
జీఓ 28 ప్రతులు దహనం చేసి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు.
దిశ, జనగామ : జీఓ 28 ప్రతులు దహనం చేసి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు 23న ఉద్యోగుల పెన్షన్ విద్రోహదినంగా పాటించారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. తాటికొండ జెడ్పీహెచ్స్లో నిర్వహించిన నిరసనలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. లింగమూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల జీవితాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు వారి
జీతాలలో కోత విధించి ఆ డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టి జూదం ఆడటం సిగ్గుచేటు అన్నారు. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు కె. లక్ష్మణమూర్తి, ప్రధానోపాధ్యాయులు రాజేందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.