రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయం: MLC Palla Rajeshwar Reddy

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-10 15:36 GMT

దిశ, వేలేరు: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని షోడాషపల్లి ఎస్ఎస్ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్సీ కోటిరెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే రాజయ్య సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని ఆత్మీయ సమావేశానికి హాజరైన కార్యకర్తలకు చదివి వినిపించారు. అనంతరం పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వేలేరు మండలంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే భాధ్యత నాదేనని అన్నారు. అలాగే వేలేరు మండలంలో డబుల్ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన సభలో నరేంద్ర మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు.

మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 90లక్షల మందికి రేషన్ బియ్యం ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ వంటిదని అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యేందుకు, కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులను ఆత్మీయంగా కలుసుకోవడానికి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరిత విజేందర్ రెడ్డి, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, చిల్పూర్ గుట్ట దేవాలయ చైర్మన్ శ్రీధర్ రావు, జిల్లా ఆత్మ చైర్మన్ కీర్తి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు మరిజె నర్సింగరావు, వైస్ ఎంపీపీ ఆంగోతు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Read more:

బీజేపీకి బుద్ది చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయ్: ఎమ్మెల్సీ పల్లా

Tags:    

Similar News