మన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ..
మన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని టీపిసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
దిశ, శాయంపేట : మన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని టీపిసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో శ్రీ మహంకాళి బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ముందుగా జీఎస్సార్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జీఎస్సార్ మీడియాతో మాట్లాడుతూ మన సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా మహంకాళి బోనాల పండుగ నిలుస్తుందన్నారు.
గ్రామదేవలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతమన్నారు. ఆషాఢమాసంలో అమ్మవార్లు తమ పుట్టింటికి వస్తారని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. ఆషాడమాసంలో నీటి కాలుష్యంతో వ్యాధులు, రోగాల బారిన పడకుండా, తమను కాపాడాలని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతిరూపాలైన గ్రామదేవతలు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మలకు బోనాలు నివేదించారు. అనంతరం జీఎస్సార్ కు ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులుశాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు. ఈ ఉత్సవంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైనాల కుమారస్వామి, బొమ్మకంటి చంద్రమౌళి, జక్కుల నాగరాజు, గుడికందుల రమేష్, బొమ్మకంటి కుమార్, చుక్కల గోపి, వలుగుల రాంబాబు, శంకర్ తదితరులు ఉన్నారు.