రామప్ప ఉప ఆలయం గుడి పైకప్పు ధ్వంసం కేసులో నిందితుల అరెస్టు

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప ఉప ఆలయమైన గొల్లాల గుడి పై కప్పు ధ్వంసం చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు

Update: 2024-11-08 14:20 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప ఉప ఆలయమైన గొల్లాల గుడి పై కప్పు ధ్వంసం చేసిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో గుప్తనిధుల కోసం రామప్ప ఉప ఆలయం అయిన గొల్లాల గుడి పైకప్పు ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయం పై సెప్టెంబర్ 22న పురావస్తు శాఖ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) అధికారి చెన్నబోయిన కుమారస్వామి ఫిర్యాదు మేరకు వెంకటాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నలుగురు నిందితులు జాగిరి నరేష్,పులి గౌతమ్,నలుబోతుల ఎర్రయ్య బయ్యారం గ్రామానికి చెందినవారు, రాయబారు ఆగయ్య, గుర్రంపేట గ్రామానికి చెందినవారుగా గుర్తించి బుధవారం వెంకటాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి ములుగు కోర్టులో హాజరు పరిచారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. రామప్ప ఉపాలయాల ధ్వంసం కేసులో పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Similar News