ఐనవోలు జాతరకు తగ్గిన భక్తులు

హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని ఐనవోలు మల్లన్న జాతరలో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి భారీగా తగ్గింది.

Update: 2025-01-14 14:03 GMT
ఐనవోలు జాతరకు తగ్గిన భక్తులు
  • whatsapp icon

దిశ, వర్ధన్నపేట : హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని ఐనవోలు మల్లన్న జాతరలో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి భారీగా తగ్గింది. దీంతో భక్తులు లేక దక్షిణ ద్వారం వైపు ఉన్న క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రాక తగ్గడంతో దేవాలయం ఆదాయం భారీగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. గతేడాది నుండి స్పెషల్ దర్శనానికి ఒకొక్కరికి రూ.500 టికెట్ల రూపంలో వసూలు చేశారు. ఈ నేపథ్యంలో లక్షల్లో ఆదాయం సమకూరింది. ఈ తరుణంలో ఆలయంలో భక్తుల రద్దీ తగ్గడంతో స్పెషల్ దర్శనానికి భక్తులు ఆసక్తి చూపడం లేదు.

     కొద్ది మేర భక్తులు రావడంతో భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. మల్లన్న ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులు లేక వెల వెలబోతున్నాయి. భక్తులు శివసత్తుల పూనకాలతో డప్పుల నడుమ పసుపు బండారితో బోనం చేల్లించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మార్ణేని వంశస్తులు ప్రభబండిని రంగుల పూలతో అలంకరించారు. కాసేపట్లో ప్రభ బండి ఊరేగింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యువకులు రాత్రి వేళలో భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది.

మల్లన్న ను దర్శించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి

మల్లన్న ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట పలువురు బీఆర్ఎస్ మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు. 


Similar News