ఆకేరు వాగు అతలాకుతలం.. వర్ష బీభత్సం ఏడు చెరువులకు గండి

నర్సింహులపేట పేట మండలంలో గత శనివారం ఉదయం

Update: 2024-09-01 13:12 GMT

దిశ,నర్సింహులపేట: నర్సింహులపేట పేట మండలం లో గత శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవు పల్లి శివారు ఆకేరు వాగు ప్రాంతం అతలాకుతలమైంది. దీనితోపాటు మండలంలోని ఏడు చెరువులకు వరద ప్రభావంతో గండ్లు పడ్డాయి. మండలంలోని నర్సింహులపేట లో బంధం చెరువు,రామన్నగూడెం వెంకమ్మ చెరువు,జయపురం పెద్ద నాగారం గుండ్ల చెరువు, పడమటిగూడెంలోని కుమ్మోనికుంట చెరువులు గండ్లు పడ్డాయి.

అకాల వర్షంతో మండలంలోని రైతులు సాగు చేసిన వరి మరియు పత్తి మిర్చి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో తహశీల్దార్ నాగరాజు,ఎస్సై సురేష్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో చెరువులు,కుంటల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఎవరైనా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నట్లయితే పోలీసుల సహకారం కోసం సంప్రదించాలని ఎస్సై సురేష్ తెలిపారు.


Similar News