బల్దియా ప్రజావాణికి 120 ఫిర్యాదు.. పరిష్కారం చూపని అధికారులు
బల్దియా ప్రజావాణికి నగర ప్రజల నుంచి దరఖాస్తులు

దిశ,వరంగల్ టౌన్ : బల్దియా ప్రజావాణికి నగర ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క ఫిర్యాదుదారుడు పదులసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా సమస్యలు పరిస్కరించబడడం లేదని తెలుస్తోంది. అధికారులు ఆ దిశగా చొరవ చూపడం లేదని బాధితులు వాపోతున్నారు. అందుకు నిదర్శనంగా సోమవారం జరిగిన బల్దియా గ్రీవెన్స్ కు 120 దరఖాస్తులు రావడం గమనార్హం. బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ప్రజల నుంచి తీసుకున్నఫిర్యాదుల వివరాలు ఇలా.. ఇంజనీరింగ్ విభాగానికి 32,హెల్త్ అండ్ సానిటేషన్ కి 03, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)కి 17, టౌన్ ప్లానింగ్ విభాగానికి 62,మంచినీటి సరఫరాకు 06దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, డిఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డి రాడేకర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మా రెడ్డి, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.