నాలుగు గంటలకు వరంగల్ సీపీ ప్రెస్ మీట్..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సాయంత్రం 5 గంటల తర్వాతనే రిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
దిశ, వరంగల్ బ్యురో: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సాయంత్రం 5 గంటల తర్వాతనే రిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ను 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉందని చెప్పడానికి సంబంధించిన వివరాలు 4 గంటల ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు.
420, 120B, సెక్షన్ 5ఆఫ్ మాల్ ప్రాక్టీస్, సీఆర్పీసీ 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పకడ్బందీగా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బండిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వరంగల్ పోలీసులు తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని 4గంటలకు మీడియా ముందు ఉంచనున్నారు సీపీ రంగనాథ్.