Water Problem: వారం రోజులుగా నీళ్లు లేవు.. ఖాళీ బిందెలతో గ్రామస్తుల ఆందోళన

గత వారం రోజులుగా తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.

Update: 2024-05-14 07:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గత వారం రోజులుగా తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని దోమ మండలం మోత్కూర్ గ్రామంలో వారం రోజుల నుంచి తాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం ఉదయం ఖాళీ బిందెలతో రోడ్డు మీద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

నీళ్లు తెచ్చుకోవాలంటే ఎక్కువ దూరం పోవాల్సి వస్తుందని గ్రామస్థులు తెలిపారు. వంటకు, తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. మరోవైపు చూడటానికి మాత్రమే ఊర్లో బోర్లు కనబడుతాయని కానీ తాగడానికి మాత్రం చుక్క నీరు లేదని గ్రామస్తులు వాపోయారు. రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వస్తారు.. కానీ నీళ్ల సమస్య తీర్చరని గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..