Rains Alert:హైదరాబాద్‌కి హై అలర్ట్.. నగరాన్ని వణికించనున్న వరుణుడు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి.

Update: 2024-07-31 10:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జులై నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి అని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. దీంతో స్టేట్ వైడ్‌గా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందనే చెప్పవచ్చు. అయితే ఆగస్టు నెలలో వర్షాలపై తాజాగా బిగ్ అప్డేట్ వచ్చిందనే చెప్పవచ్చు. అయితే భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ క్రమంలో జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు నేడు (బుధవారం) తెలిపారు. ఆగస్టు 15 నుంచి 30 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. కావున ఆగస్టు నెలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Tags:    

Similar News