Maha Aarti Rally: భారతమాత మహాహారతి ర్యాలీ.. ట్రాక్టర్ నడిపిన కేంద్ర మంత్రి

రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మహా హారతి కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.

Update: 2025-01-25 13:29 GMT
Maha Aarti Rally: భారతమాత మహాహారతి ర్యాలీ.. ట్రాక్టర్ నడిపిన కేంద్ర మంత్రి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: రిపబ్లిక్ డే సందర్భంగా భారతమాత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన (Bharata Mata Maha Aarti) మహా హారతి కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) హాజరయ్యారు. భారతమాత హారతి కార్యక్రమంలో భాగంగా.. శనివారం ట్యాంక్ బండ్ ప్రసాద్ ఐ మ్యాక్స్ అంబేడ్కర్ విగ్రహం నుంచి భారతమాత (Bharata Mata) విగ్రహం ఊరేగింపు (Maha Aarti rally) ర్యాలీ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరతమాత విగ్రహం ఉన్న ట్రాక్టర్‌ను డ్రైవ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. కాగా, ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారతమాత మహాహారతిని ఈసారి వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Tags:    

Similar News