నిజామాబాద్ ఆసుపత్రి ఘటనపై కిషన్ రెడ్డి సీరియస్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసిన అమానుష సంఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగు చూసిన అమానుష సంఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. స్ట్రెచర్ లేక రోగి బంధువులే అతడి కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన ఘటనకు సంబంధించిన విజువల్స్ కలవరపెట్టేవి మాత్రమే కావని ఇది వ్యవస్థాగత వైఫల్యం అని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ చెబుతున్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయిస్తున్నది మొత్తం వ్యయంలో కేవలం 5 శాతం మాత్రమే అన్నారు. ఇది జాతీయ సగటు 7 శాతం కంటే తక్కువేనని అని విమర్శించారు. తెలంగాణలో జరిగే చాలా కేటాయింపులు కేవలం కేటాయింపులుగానే మిగిలిపోతున్నాయని వాటికి నిధులు విడుదల కావడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read..
నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై స్పందించిన షర్మిల.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు