సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ..
సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. సింగరేణి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.. 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిది.. మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నప్పడు కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. అంతేకాకుండా కేవలం గుజరాత్‌కే బొగ్గు గనులు ఇస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అభద్రతా భావంతోనే కేంద్రంపై ఇలాంటి తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో రోజురోజుకు బీజేపీకి వస్తున్న ఆధరణ చూసి భయపడే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల హాయంలో స్కాంలతో దేశ ఆర్థివ వ్యవస్థ చిన్నాభిన్నామైందని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టిందని తెలిపారు.