Kishan Reddy: తెలంగాణలో బీజేపీ పొత్తులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పొత్తులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-03-09 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పొత్తులపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోందని మరోసారి ఆయన తేల్చి చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిట్టింగ్ స్థానాలతో పాటు ఈ సారి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించాలనేదే తమ లక్ష్యమన్నారు. బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గానూ 9 మంది పేర్లు ప్రకటించామని, మిగితా 8 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి మిగిలిన 8 మంది అభ్యర్థులపై చర్చిస్తానన్నారు. అనంతరం అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. పార్టీలో చేరికలు అనేవి నిరంతర ప్రక్రియ అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కిషన్ రెడ్డి ఇది వరకే క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ప్రచారం మాత్రమ ఆగలేదు. ఈ క్రమంలో ఆయన మరోసారి తెలంగాణలో బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు అని వస్తోన్న వార్తలకు బ్రేక్ పడింది. 

Tags:    

Similar News