Union Budget 2025-26: బీజేపీ ఎంపీలు ఆ పని చేస్తున్నారని అనుకుంటున్నాం.. మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Parliament Budget Session) నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) శనివారం లోక్‌సభ (Lok Sabha)లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Parliament Budget Session) నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Seetharaman) శనివారం లోక్‌సభ (Lok Sabha)లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్ (Central Budget)లో తెలంగాణ (Telangana)కు నిధుల కేటాయింపుపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో తెలంగాణ (Telangana)కు ఎక్కు నిధులు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఇప్పటితే తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman)కు వినతి పత్రాలు అందజేశారని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా బీజేపీ (BJP) ఎంపీలు కూడా ప్రయత్నిస్తున్నారని తాము కూడా అనుకుంటున్నామని కామెంట్ చేశారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ జీడీపీ (DGP)లో తెలంగాణ వాటా ఎక్కువగా ఉందని అన్నారు. AI (Artificial Intelligence), ఫోర్త్ సిటీ (Fourth City) లాంటి విజన్‌తో తాము ముందుకు వెళ్తున్నామని, మౌలిక సదుపాయాలకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం ఉంటుందని తెలిపారు. ప్రజలంతా ఇన్‌కమ్ ట్యాక్స్ (Income Tax) శ్లాబ్‌లలో ప్రజలు సవరణను ఆశిస్తున్నారని పేర్కొన్నారు. పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.