కామారెడ్డి ఘటనలో ఇద్దరు డాక్టర్లు, నర్స్ సస్పెండ్

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులైన డాక్టర్లు, నర్సును మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి సస్పెండ్ చేశారు.

Update: 2024-02-11 16:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న పేషెంట్‌ను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులైన డాక్టర్లు, నర్సును మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ త్రివేణి సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులను సస్పెండ్ చేస్తున్నామని ఆమె ప్రకటించారు. ఐసీయూ ఇంచార్జ్ డాక్టర్ కావ్య, ఐసీయూ జనరల్ మెడిసిన్ ఇన్‌చార్జ్ డాక్టర్ వసంత్ కుమార్, డ్యూటీ నర్స్ జి.మంజుల విధుల్లో నిర్లక్ష్యం వహించారని, అందుకే ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి హాస్పిటల్ ఇదివరకు వైద్య విధాన పరిషత్‌లో ఉండగా, గతేడాది మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేసి డీఎంఈ పరిధిలోకి తీసుకొచ్చారు.

Tags:    

Similar News