మళ్లీ ట్విట్టర్ వార్: కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్

ట్విట్టర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ‌గా మారింది. కేటీఆర్ ట్విట్‌కు అదే స్థాయిలో బండి సంజయ్ రియాక్టు అవుతున్నారు.

Update: 2023-03-30 14:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ట్విట్టర్‌లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ‌గా మారింది. కేటీఆర్ ట్విట్‌కు అదే స్థాయిలో బండి సంజయ్ రియాక్టు అవుతున్నారు. ఇద్దరులో ఎవరు ట్వీట్ పెట్టినా మరోకరు స్పందించడం పరిపాటిగా మారింది. ఇప్పటివరకు మీడియా ముందు విమర్శలు చేసుకునే ఇరువురు పేపర్ లీకేజీ అంశం తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు. ఈనెల 22న ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించిన పంచాంగంలో కేటీఆర్ ఆదాయం అదానికీ.. వ్యయం జనానికి, బ్యాంకులకు అని ట్వీట్ చేయగా.. బండి సంజయ్.. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి... వ్యయం తెలంగాణ రాష్టానికి అని ట్వీట్‌లు చేసుకున్నారు.

అయితే మళ్లీ గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకొని మరోసారి ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. శుక్రవారం నడ్డా హైదరాబాద్‌కు.. వచ్చే నెల 8న మోడీ రాష్ట్రానికి వస్తున్న తరుణంలోసోషల్ వార్ వేడెక్కింది.

కేటీఆర్ ట్విట్టర్‌లో

తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం- ప్రధాని

పసుపు బోర్డు ఇవ్వం -ప్రధాని

మెట్రో రెండో దశ ఇవ్వం- ప్రధాని

ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం- ప్రధాని

,గిరిజన యూనివర్సిటీ ఇవ్వం- ప్రధాని ,

బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం- ప్రధాని

, ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం- ప్రధాని ,

ప్రధాని ప్రాధాన్యతల్లో.. అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలోప్రధాని ఎందుకు ఉండాలి..?.. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.? అని కేటీఆర్ పోస్టు చేశారు.

బండి సంజయ్...

ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం- కేసీఆర్

దళితులకు మూడెకరాలు ఇవ్వం - కేసీఆర్

దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం - కేసీఆర్

ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం - కేసీఆర్

నిరుద్యోగ భృతి ఇవ్వం - కేసీఆర్

డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం - కేసీఆర్

దళితబంధు అర్హులకు ఇవ్వం - కేసీఆర్

ఇలా ఇద్దరిమధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరిగింది. ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. రానున్న కాలంలో ఇది ఎటుదారి తీస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News