ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? కాంగ్రెస్ , బీఆర్ఎస్ సోషల్ వార్!
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఏది రేవంత్? మహిళలకు రూ. 2,500 భృతి ఏది? గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెబుదామని బీఆర్ఎస్ పార్టీ ఆదివారం ట్వీట్లు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాన పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఏది రేవంత్? మహిళలకు రూ. 2,500 భృతి ఏది? గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెబుదామని బీఆర్ఎస్ పార్టీ ఆదివారం ట్వీట్లు చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేసింది.
బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం బట్ట బయలు అయిందని పేర్కొంది. ‘ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారు? బీజేపీ పై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు! పూర్తిగా బీజేపీ గా మారిపోయిన బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజలార తస్మాత్ జాగ్రత్త!’ అంటూ బీఆర్ఎస్‌కు కౌంటర్ ట్వీట్ వేసింది.
పదేళ్ల బీజేపీ పాలన పై దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుంటే మోడీని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్.. ఒక్క బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టని 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారని విమర్శించింది. ఎన్నికలకు ఒక్క రోజు ముందు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని, లిక్కర్ కేసులో కవితని తప్పించేందుకేనా? అని ఆరోపించింది.
Read More...
దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది!.. బీఆర్ఎస్ ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్