TS TET-2024: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్..షెడ్యూల్‌లో మార్పులు, విద్యాశాఖకు ఈసీ కీలక ఆదేశాలు జారీ

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది.

Update: 2024-05-03 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ నెల 27న ఉన్నందున.. ఇదే విద్యాశాఖ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. పోలింగ్ రోజు పరీక్ష నిర్వహించడం సాధ్యం అయ్యే పని కాదని, టెట్‌ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని తాజాగా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి సీఈవో లేఖ రాశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షపై పడింది. ఈ క్రమంలో పరీక్ష తేదీలను విద్యా శాఖ మరోసారి పొడిగించింది. మే 25, 26, 27 తేదీల్లో TS TET-2024 పరీక్షలు ఉండవని విద్యా శాఖ స్పష్టతనిచ్చింది. అయితే, మే 20 నుంచి జూన్‌ 3 వరకు తెలంగాణ టెట్‌-2024 పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..