విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే!

టీఎస్ ఎంసెట్ ఎంట్రెన్స్‌కు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శనివారం విడుదల చేసింది.

Update: 2023-05-27 11:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఎంసెట్ ఎంట్రెన్స్‌కు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉండనుంది. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 26న ఆన్ లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ ఉంటుంది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. జులై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నడుస్తుంది. జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ స్టార్టవుతుంది.

ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News