TS Elections : ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2023-12-03 02:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు ఉన్నాయి. 8.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ఓపెన్ చేసి కౌంటింగ్ షురూ చేయనున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో 14 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఒకే చోట కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 28 జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు ఒక్కో చోట కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. లెక్కింపు కేంద్రాల వద్ద 40 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


Similar News