TS Elections : కౌశిక్‌రెడ్డిపై కమలాపూర్ పీఎస్‌లో కేసు నమోదు

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాడి కౌశిక్‌రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2023-11-29 07:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాడి కౌశిక్‌రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజున కౌశిక్‌రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నది. ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి “ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడితే శవయాత్ర.. నేను ఏ యాత్ర చేయాలో మీరే నిర్ణయించుకోండి..” అంటూ ఓటర్లకు అప్పీల్ చేశారు.

ఈ వ్యాఖ్యలతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారో.. లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నారో.. లేక బెదిరిస్తున్నారో.. అర్థంకాక ప్రజల్లోనే రకరకాల చర్చలు జరిగాయి. కౌశిక్‌రెడ్డి కామెంట్లను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నది. సమగ్రంగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.

Tags:    

Similar News