TG Assembly: కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఆ అంశాలపైనే కీలక చర్చ!

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Update: 2024-12-16 04:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సభలో పలు బిల్లులపై చర్చ జరగనుంది. ముందుగా ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతి (Komireddy Jyothi), ఊకే అబ్బయ్య (Vuke Abbaiah), రామచంద్రారెడ్డి (Ramachandra Reddy)లకు సభ సంతాపం తెలుపనుంది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speakar Gaddam Prasad Kumar) ప్రశ్నోత్తరాలను ప్రారంభించనున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోయే టూరిజం పాలసీ (Tourism Policy)పై చర్చ జరగనుంది. అదేవిధంగా బెల్టు షాపుల (Belt Shops) మూసివేత, పెండింగ్ బిల్లులు (Pending Bills), టీజీఐఐసీ పార్కు (TGIIC Park)లపై ప్రభుత్వం తరఫున సభ్యులు సమధానాలు ఇవ్వనున్నారు. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (Sports University), తెలంగాణ వర్సిటీ (Telangana University) సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. 

Tags:    

Similar News