కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిందే టీఆర్ఎస్ పార్టీ.. : అసెంబ్లీలో హరీశ్ రావు కామెంట్స్
అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. సీఎం రేవంత్ రెడ్డిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని గెలిచిందని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్‌కు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే టీఆర్ఎస్ పార్టీ అని హరీశ్ రావు గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టారని మేము ఆనాడు బయటకు వచ్చామని, ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశామని అన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణకు చెందిన ఏ ఒక్కరూ మాట్లాడలేదని.. ఒక్క పీజేఆర్ మాత్రమే మాతో కలిసి గళమెత్తారని హరీశ్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ రోజు టీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్ పోటీ చేసిందని.. మా పార్టీ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ కేబినెట్‌లో టీఆర్ఎస్ ఉన్నా.. ఆరు కారణాలతో 14 నెలలకే ఆరుగురు మంత్రులు రాజీనామా చేశామని, నాతోపాటు పద్మారావు గౌడ్ ప్లకార్డులు పట్టుకొని సభలో పోరాటం చేశారని హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.