ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలకు ట్రైనింగ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ట్రైనింగ్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎక్స్ పర్ట్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ మీటింగ్ జరగనున్నది.

Update: 2024-02-10 17:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ట్రైనింగ్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎక్స్ పర్ట్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ మీటింగ్ జరగనున్నది. సీఎం అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు క్యాబినెట్‌తో పాటు ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు.12వ తేదీన ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మేల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం, ఎక్స్ పర్ట్స్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిలోని అంశాలు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవలే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగిన తప్పిదాలు వంటి అంశాలపై సీఎం సమక్షంలో ఎక్స్ పర్ట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

గత ప్రభుత్వ హయంలో తీసుకువచ్చామని ప్రచారం చేస్తున్న ప్రాజెక్టుల వాస్తవిక పరిస్థితులు ఏమిటి? ఎన్ని ఎకరాలకు నీళ్లు అందుతున్నాయి? ఎంత నష్టం జరిగింది? నీళ్లు ఎత్తిపోయడానికి పెడుతున్న ఖర్చు వంటి వాటిపై డిస్కషన్ చేయనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీ –డిజైన్‌తో జరిగిన నష్టం, రైతుల రియాలిటీ అభిప్రాయాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ల ప్రస్తుత సిచ్వేషన్, పెండింగ్ లోని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు లపై కూడా చర్చించనున్నారు. గత పదేళ్లలో ఇరిగేషన్‌లో జరిగిన వైఫల్యాలతో బీఆర్ఎస్ ఎదురుదాడి చేయడంపై సీఎం రేవంత్ తన ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. మరోవైపు ఈ నెల 13న మేడిగడ్డకు ఎమ్మెల్యేలు, అధికారుల పర్యటనపై అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..