మెదక్ నుంచి తిరుపతికి రైలు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

మెదక్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రైలు నడపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రైల్వే అధికారులను కోరారు.

Update: 2023-08-18 09:16 GMT

దిశ, మెదక్ : మెదక్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రైలు నడపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రైల్వే అధికారులను కోరారు. డివిజనల్ రైల్వే యుజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్‌యుసీసీ) సమావేశం హైదరబాద్‌లో జరిగింది. కమిటీ దృష్టికి ఎమ్మెల్యే 15 అంశాల‌ను తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మెదక్ నుంచి తిరుపతి వరకు వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని కోరారు. చేగుంట మార్గంలో ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పగా టెండర్ ప్రక్రియలో ఉందని త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అక్కన్న పేట,  మీర్జా‌పల్లి వద్ద ఆపాలని, దీని వల్ల మెదక్ జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. తిరుపతి రైలు ఏర్పాటుతో పాటు ఇతర అంశాల పై అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Tags:    

Similar News