విషాదం.. ఏడుపాయలలో గజ ఈత గాడు మృతి

మూర్ఛ వ్యాధి రావడంతో నీటి మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏడుపాయల చెక్ డ్యాం వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

Update: 2023-02-20 08:51 GMT

దిశ కొల్చారం: మూర్ఛ వ్యాధి రావడంతో నీటి మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏడుపాయల చెక్ డ్యాం వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన పాపన్న‌పేట‌కు చెందిన గుమ్మడి సాయిలు (30) మత్స్య కార్మికుడిగా జీవనోపాధి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే జాతరలో నీటి ప్రమాదాల నివారణ కోసం ఫిషరీస్ శాఖ అధ్వర్యంలో గజఈతగాళ్లను ఏర్పాటు చేసింది.

అందులో సాయిలు పేరు నమోదు చేసుకున్నాడు. తెప్ప ద్వారా చెక్ డ్యాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో తెప్ప‌పై మూర్ఛ వ్యాధి రావడంతో అకస్మాత్తుగా నీటిలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మరో కార్మికుడు రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు నీట మునగడం గమనించిన భక్తులు అరుపులు వేయడంతో మరికొంత మంది గజ ఈత గాళ్లు వెంటనే నీళ్లలోకి దిగి కాపాడే ప్రయత్నం చేశారు.

సాయిలు మృతి చెందగా మరో వ్యక్తిని కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందివ్వగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి బార్య నాగమణి, కుమారుడు అబ్బిరాజు ఉన్నారు.

Tags:    

Similar News