రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.

Update: 2024-08-14 12:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆగస్ట్ 15న గోల్కొండలో జరిగే వేడుకలకు వచ్చేవారికోసం.. వెళ్లాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాప్ తయారు చేశారు. గురువారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. రాణిమహాల్ లాన్స్ నుండి గోల్కొండకు వరకు ఉన్న రోడ్డును రేపు తాత్కాలికంగా మూసివేస్తారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు, అధికారులకు, ఆహ్వానం ఉన్నవారికి గోల్డ్, పింక్, నీలం పాసులు అందజేశారు. ఈ పాసులు కలిగిన వారు ఆయా రూట్లలో పాస్ చూపించి ప్రయాణించవచ్చు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం నుండి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చేవారు ఆయా పాసులు చూపిస్తేనే గోల్కొండ వరకు అనుమతి ఉంటుంది.

*గోల్డ్ పసులు ఉన్నవారు వాహనాలను పోర్ట్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి ఫతేదర్వాజ రోడ్డువైపు పార్క్ చేసుకోవాలి.

*పింక్ పాసులున్న వారు కోట ద్వారం నుండి 50 మీ. దూరంలో ఉన్న గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్క్ చేసుకోవాలి.

*పింక్ బీ పాసులున్న వారు గోల్కొండ బస్ స్టాప్ నుండి కుడివైపు మలుపు తీసుకొని ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద పార్క్ చేసుకోవాలి.

*గ్రీన్ పాసులున్న వారు కోటా ప్రధాన ద్వారం నుండి 500 మీ. దూరంలో ఉన్న ఓసీ ప్లే గ్రౌండ్ వద్ద పార్క్ చేసుకోవాలి.

*ఎరుపు పాసులున్న వారు  ప్రియదర్శి స్కూల్లో, బ్లాక్ పాసులున్న వారు హుడా పార్క్ వద్ద తమ వాహనాలను పార్క్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

*షేక్పేట, టోలిచౌకీ నుండి వచ్చే సాధారణ ప్రజలు వారి వాహనాలను సెవెన్ టూంబ్స్ వద్ద తమ వాహంబలను పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.     


Similar News