కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు, తులం బంగారం.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా
దిశ, వెబ్‌డెస్క్: గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని.. గిరిజనులకు న్యాయం చేసేది రాబోయే కాంగ్రెస్ సర్కారే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా రామంజపురంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమరుల బలిదానాలతో తెలంగాణ కల సాకారం అయ్యిందన్నారు. తెలంగాణలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ చేసిందేమి లేదని మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అమరులు, నిరుద్యోగుల ఆశలను కేసీఆర్ అడియాసలు చేశారని నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి, అరాచకం తాండవిస్తోందన్నారు. తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను సోనియా గాంధీ నేరవేర్చారని, కానీ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదన్నారు. అందుకే ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని తెలిపారు. 500 గ్యాస్ సిలిండర్, రైతులకు ఏటా రూ.15 వేలు, కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటు.. తులం బంగారం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకు గాంధీ కుటుంబం వచ్చిందన్నారు.