షర్మిల వచ్చి నాయకత్వం వహిస్తే ఊరుకుంటామా: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్ షర్మిలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-06-12 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే తెలంగాణ వాళ్లు పాలించడానికి అని.. అలాంటిది పొరుగు రాష్ట్రానికి చెందిన షర్మిల వచ్చి ఇక్కడ నాయకత్వం వహిస్తానంటే ఊరుకుంటామా అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే స్వాగతిస్తానని స్పష్టం చేశారు.

షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే.. సహచర పీసీసీ చీఫ్‌గా ఆమె కలుస్తానని తెలిపారు. అంతేకానీ.. నేను ఇక్కడ ఉన్నని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని రేవంత్ తేల్చిచెప్పారు. కాగా, వైఎస్సార్టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయం చేస్తోన్న షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అంతేాకాకుండా.. పార్టీ విలీనం తర్వాత టీపీసీసీ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారని.. కాంగ్రెస్ కీలక నేత, దివంగత సీఎం వైఎస్‌ఆర్ బిడ్డగా కూడా షర్మిల ఇమేజ్‌ కాంగ్రెస్‌‌కు కలిసివస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా కర్నాటక ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచిన డీకే శివకుమార్‌తో షర్మిల పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం నిజమేనన్న ప్రచారం జరిగింది. కర్నాటక వేదికగా షర్మిల ఇందుకోసం రాజకీయాలు సాగిస్తున్నారని టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన తాజా కామెంట్స్ ఆ వార్తలకు చెక్ పెట్టాయి. 


Click Here For Latest Telangana News

Tags:    

Similar News