మహిళ చనిపోతే అరెస్ట్ చేయవద్దా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
పుష్ప-2 సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
దిశ, వెబ్ డెస్క్: పుష్ప-2 సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్(Arrest) వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో కావాలనే ఆయనను అరెస్టు చేశారని.. స్థానిక ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగా అల్లు అర్జున్ కు.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి మద్దతు లభించడం తో పాటు.. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. అలాగే జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు సైతం.. జాతీయ అవార్డు గ్రహీత ను అరెస్టు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై వ్యతిరేకత మొదలవ్వడంతో.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు.. స్పందిస్తున్నారు. హీరో అల్లు అర్జున్ అరెస్టుకు తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) స్పందించారు. హీరో అల్లు అర్జున్ పై తమకు ఎలాంటి కక్ష లేదని, ఆయన కారణంగా ఓ మహిళ చనిపోతే అరెస్ట్ చేయ వద్దా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.