TPCC: చెన్నారెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాడారు.. మహేశ్ కుమార్ గౌడ్
చెన్నారెడ్డి(Chenna Reddy) సమాజిక న్యాయం(Social Justice) కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు(Telangana Congress President) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: చెన్నారెడ్డి (Chenna Reddy) సామాజిక న్యాయం (Social Justice) కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు (Telangana Congress President) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం (United AP Former CM) మర్రి చెన్నారెడ్డి(Marri Chenna Reddy) వర్థంతి సందర్భంగా ఇందిరాపార్క్(Indira Park) లోని చెన్నారెడ్డి మొమోరియల్ రాక్ గార్డెన్స్ (Chenna Reddy Memorial Rock Gardens) లో మహేశ్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణ్ దేవ్ వర్మ (Governor Jishnu Dev Varma), బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి దూరదృష్టి గల నాయకుడని అన్నారు. ఆయన 28వ వర్ధంతి సందర్భంగా చెన్నా రెడ్డి చేసిన సేవలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ రెడ్డి సామాజిక న్యాయం, సమానమైన అభివృద్ధి కోసం పోరాడారని తెలిపారు. అలాగే ఆయన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అని, ఆయన ప్రగతిశీల విధానాలు రాష్ట్రంపై చెరగని ముద్ర వేసాయని కొనియాడారు. అంతేగాక ఆయన దార్శనికత తరతరాల నాయకులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సహా ఇతర ప్రముఖులతో వేదిక పంచుకోవడం గౌరవంగా ఉందని పీసీసీ చీఫ్ అన్నారు.