Mahesh Kumar Goud : అధిష్టానానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా : టీపీసీసీ చీఫ్

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల(MLC Election) నగారా మోగిన విషయం తెలిసిందే.

Update: 2025-01-30 11:09 GMT
Mahesh Kumar Goud : అధిష్టానానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా : టీపీసీసీ చీఫ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల(MLC Election) నగారా మోగిన విషయం తెలిసిందే. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ ను(MLC Election Notification Schedule) ఎన్నికల సంఘం(EC) విడుదల చేసింది. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపినట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC Cheif Mahesh Kumar Goud) వెల్లడించారు. గురువారం మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లోని గాంధీ భవన్లో(Gandhi Bhavan) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగలరనే నమ్మకం తనకు ఉందన్నారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో(GHMC Elections) కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని తెలియజేసిన ఆయన.. ఫిబ్రవరి 5న కులగణన(Cast Census) నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. కమిటీ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసి.. రిజర్వేషన్స్ అంశంపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రతిపక్షాలు తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని.. ప్రజల కోసం, రైతులకు, సామాన్యుల కోసం తాము ఎన్నో పథకాలు చేపట్టామని.. విపక్షాలు తమపై బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపుకోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి . నల్గొండ-ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్ - మెదక్ - ఆదిలాబాద్- నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ, కరీంనగర్- మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కోసం.. బీజేపీ (BJP) తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.

Tags:    

Similar News