బాధ్యులను సస్పెండ్చేయండి.. హుస్సేన్‌సాగర్ ఘటనపై మంత్రి జూపల్లి సీరియస్
హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఇప్పటివరకూ అధికారులు తనకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని అధికారులను మంత్రి జూపల్లి నిలదీశారు. తక్షణమే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం సచివాలయంలో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. టూరిజం బోట్‌లో బాణాసంచా ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. బాధ్యులైన సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.