తిరుమల లడ్డూ వివాదం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం పై దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Update: 2024-09-26 02:25 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ పై దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ కల్తీ వివాదం పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. శ్రీవారి లడ్డూ తయారీకి గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందనే వార్త తెరపైకి రావడంతో మిగతా ఆలయాల్లో పరిస్థితేంటి? ఎలాంటి నెయ్యి వాడుతున్నారు? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆలయాల్లో వినియోగించే నెయ్యి, ఇతర పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్‌కు పంపించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇక పై లడ్డూలు, ప్రసాదాల తయారీకి ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నుంచే నెయ్యి, పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆలయాల ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారని తెలిసి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో విజయ డెయిరీ నెయ్యికి డిమాండ్ ఒక్కసారిగా పెరగనుంది.


Similar News